రేవంత్‌ కుల గణన.. వాళ్లు ఫుల్ హ్యాపీస్‌?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై నేషనల్ ఓబీసీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం, ఆల్ ఇండియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులను కలిసిన కృతజ్ఞతలు తెలిపింది. గత వారం జనవరి 12న భారత్ జోడో అభియాన్ సమావేశంలో రాహుల్ గాంధీ దృష్టికి తీసికెళ్లామని నేషనల్ ఓబీసీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. తక్షణమే తగిన ఆదేశాలు వేంటనే ఇవ్వాలని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఆదేశించారని ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ తెలిపారు.

కుల గణన చేసి వెంటనే బీసీలకు రిజర్వేషన్ల అన్ని సదుపాయాలను కల్పించాలన్న ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ .. అలాగే తెలంగాణలో గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం  స్థానిక సంస్థ లలో 22 నుండి 43 శాతం వరకు పెంచాలన్నారు. దాని ప్రకారం ఎన్నికలు నిర్వహించమని  మరియు ఉద్యోగ ప్రకటనల కూడా  తక్షణం వర్తింపజేయాలని ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: