జనసేనతో పొత్తులేదు.. తేల్చి చెప్పేశారు?

Chakravarthi Kalyan
పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జనసేనతో పొత్తు ఉండదని.. ఒంటరిగానే పోటీకి దిగుతామని బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్ అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 10ఎంపీ సీట్లు సాధిస్తామని బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్ ధీమాగా తెలిపారు. ఇండియా కూటమి బీటల పరిణామమే బీహార్‌ రాజకీయాలని బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎప్పుడు నితీష్‌కుమార్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్న బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్.. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎం కాబోతుందని విమర్శించారు.

కాళేశ్వరంలో జరిగిన అవినీతిని దోపిడిని బయట పెడతామని కాంగ్రెస్ నేతలు అన్నారని బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలు ఇప్పుడేమో గొంతులు మూగబోతున్నాయని బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. సీఎం మొత్తం ప్రాజెక్టు పై విచారణ అంటున్నారని...మంత్రేమో మేడిగడ్డ వరకే ఎంక్వైరీ అంటున్నారని బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. కుల గణనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నట్లు బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: