బయటికు వచ్చేది అప్పుడే.. తేల్చి చెప్పిన కేసీఆర్‌?

Chakravarthi Kalyan
అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసేది బీఆర్‌ఎస్‌  మాత్రమేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అంటున్నారు.  త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానంటున్న కేసీఆర్.. పార్లమెంట్ లో బీఆర్‌ఎస్‌ గళం బలంగా వినిపించాలన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు భారాస ఎంపీలపైనే ఉన్నాయన్న కేసీఆర్‌.. వచ్చే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ఎంపీలతో సమావేశమాయ్యారు.

పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, పార్టీ వ్యూహం, సంబంధిత అంశాలపై వారికి కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలన్న ఆయన.. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ప్రశ్నించాలన్నారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టమని... ఆపరేషన్ మ్యానువల్, ప్రోటోకాల్‌ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారని కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌  క్షేత్రస్థాయిలో బలంగా ఉందని, ఎవరితో సంబంధం లేకుండా గట్టిగా పోరాడదామని కేసీఆర్ ఎంపీలకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: