బిగ్‌ బ్రేకింగ్‌: వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్‌?

Chakravarthi Kalyan
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని పద్మ విభూషణ్‌ పురస్కారం వరించింది. నెల్లూరు జిల్లాలో జన్మించిన వెంకయ్యనాయుడు.. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టారు. కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా సేవలందించారు. దక్షిణాదిలో బీజేపీలో అగ్రనేతగా ఎదిగినవారిలో వెంకయ్య అగ్రగణ్యులు. అమృత కాలం దిశగా భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నానని వెంకయ్య నాయుడు ప్రకటించారు.

దేశంలోని రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికీ నా ఈ పురస్కారాన్ని సగర్వంగా అంకితం చేస్తున్నానని వెంకయ్య నాయుడు అన్నారు. ఈ పురస్కారం నా బాధ్యతను మరింతగా పెంచిందన్న వెంకయ్య నాయుడు.. నవభారత నిర్మాణం దిశగా ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.  శక్తివంతమైన, ఆత్మనిర్భర భారత నిర్మాణానికి ప్రజలతో కలసి నడుస్తానని ప్రజలకు సవినయంగా తెలియజేస్తున్నానని వెంకయ్య నాయుడు స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: