యువత ఓట్లపై బీజేపీ కన్ను.. అందుకే ఆ ప్రోగ్రామ్‌?

Chakravarthi Kalyan
వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ మహిళ, యువ ఓటర్లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మహిళ స్వయం సహాయక సంఘాలతో మాతృశక్తి సమావేశాలు, యువ సమ్మేళనాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇవాళ కొత్త ఓటర్లతో ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌గా ప్రసంగిస్తారు.
వచ్చే నెలలో హైదరాబాద్‌లో కిసాన్ మోర్చా జాతీయ స్థాయి సమ్మేళనం నిర్వహించబోతున్నారు. ఈ నెల 31లోపు వాల్‌ రైటింగ్ పూర్తి చేస్తారు. ఈ నెల 28వ తేదీన అమిత్‌ షా పర్యటనపై సమీక్ష వచ్చె నెలలో రథయాత్రలపై చర్చలుంటాయి. ఈ నెల 26న తిరంగా యాత్రలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీజేపీ ఆదేశించింది. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం లబ్దిదారులతో బీజేపీ సమావేశాలు నిర్వహిస్తుంది. వచ్చే నెల 5,6,7 తేదీల్లో గ్రామ్ చలో కార్యక్రమాలు ఉంటాయి. రథ యాత్రలు వచ్చే నెల 10వ తేదీ నుంచి ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: