1174 హెక్టార్ల భూములిచ్చారు.. రేవంత్‌ ఒప్పందం?

Chakravarthi Kalyan
వికారాబాద్ జిల్లా దామగూడెంలో భారత నావికా దళం రాడార్ కేంద్రం ఏర్పాటు కోసం దామగూడంలోని 1,174 హెక్టార్ల అటవీ భూములను నావికా దళానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తూర్పు నావిక దళం, అటవీ, ఇతర శాఖల అధికారులు మధ్య ఒప్పందం జరిగింది. సంతకాలు పూర్తి చేశారు. నౌకలు, జలాంతర్గాములతో సమన్వయం చేసే వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ కేంద్రాన్ని దామగూడంలో ఏర్పాటు చేయనున్నారు.

తమిళనాడులోని తిరునెల్వేలిలో ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ కేంద్రం 1990 నుంచి సేవలు అందిస్తోంది. ఇప్పుడు రెండో స్టేషన్ దామగూడం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి 2010లోనే  నిర్ణయం జరిగింది. కేంద్రం అటవీ పర్యావరణ శాఖ 2014లో నేవీ ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. అటవీ భూముల కోసం సుమారు 155 కోట్ల రూపాయలను నేవీ తెలంగాణకు  చెల్లించింది. ఈ దామగూడం నేవీ రాడార్ కేంద్రం 2027 వరకు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: