బాబు అరెస్ట్‌పై జగన్‌ షాకింగ్‌ కామెంట్స్‌?

Chakravarthi Kalyan
చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్‌ తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తిరుపతిలో ఇండియా టుడే నిర్వహించిన ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న సీఎం జగన్‌.. రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి కదా అని రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ అడగగా అలాంటిదేమీ లేదని సీఎం జగన్‌ అన్నారు.
 
చంద్రబాబు అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యారన్న సీఎం జగన్‌.. కోర్టుల అనుమతి తర్వాతే చంద్రబాబు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఆధారాలపై సంతృప్తి చెందకుండా కోర్టులు ఎవరినీ జైలుకు పంపవు కదా అన్న సీఎం జగన్‌.. చంద్రబాబు వంటి హైప్రొఫైల్‌ వ్యక్తిని ఆధారాల్లేకుండా జైలుకు పంపరని అన్నారు. ఎన్నికల ముందు ఏ సీఎం కూడా అలాంటి సాహసం చేయరన్న సీఎం జగన్‌.. బలమైన ఆధారాలు లేకుంటే చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్టు చేయరన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: