తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ గుడ్ న్యూస్‌?

Chakravarthi Kalyan
తెలంగాణ నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్‌ చెప్పబోతున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోపు డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖ పదవీ విరమణ చేయనున్న వారితోసహా పలు వివరాలు సేకరించింది. ఈ సంవత్సరం తెలంగాణలో మొత్తం 3,800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తున్నారు. వారు 2021లోనే పదవీ విరమణ చేయాల్సి ఉన్నా.. ప్రభుత్వం రిటైర్‌మెంట్‌ వయసును మూడేళ్లు పెంచినందున ఇంకా పనిచేస్తున్నారు.
ఈ మార్చి నెలాఖరు నుంచి తెలంగాణలో ఉపాధ్యాయుల పదవీ విరమణలు ప్రారంభమవుతాయి. అందుకే కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలి. అయితే గత ఏడాది ఆగస్టులో కేసీఆర్ సర్కారు 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇప్పుడు ఆ ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. పాత నోటిఫికేషన్‌కు సుమారు మరో 5 వేల ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్‌ ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: