ఆ నిర్లక్ష్యం ఏటా లక్షన్నర మందిని చంపేస్తోంది?

Chakravarthi Kalyan
జనవరి 15వ తేదీ నుండి ఫిబ్రవరి 14వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత మాసంగా ప్రకటించింది. దీనిపై ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీ లతో తెలంగాణ డిజిపి రవిగుప్తా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్డు భద్రత మాసాన్ని అత్యంత అప్రమత్తతతో నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా యువత చనిపోతున్నారని.. 2022లో తెలంగాణలో 7500 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారని డిజిపి తెలిపారు.

దేశంలో 1.68లక్షల మంది చనిపోయారని గణంకాలు చెబుతున్నాయన్న డిజిపి రవిగుప్తా.. హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, ఓవర్ స్పీడింగ్, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రహదారులు ఉండే ప్రాంతాల్లో రోడ్ సేఫ్టీ క్లబ్బులను ఏర్పాటు చేయాలని.. పోలీస్ కార్యాలయంలో డిస్టిక్ రోడ్ సేఫ్టీ బ్యూరో, కమిషనరేట్ లలో కమిషనరేట్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేసుకోవాలని.. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడే వారికి "గుడ్ సమా రిటన్" పేరిట సన్మానం చేయాలని డిజిపి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: