రాహుల్‌ గాంధీ రావణుడు.. షాకింగ్‌ కామెంట్స్‌?

Chakravarthi Kalyan
ఇవాళ అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ గురించి దేశమంతా మాట్లాడుకుంటోందిు. ఈ సమయంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మాత్రం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. రాహుల్‌ గాంధీని పరోక్షంగా రావణుడంటూ కామెంట్‌ చేశారు.
రాహుల్‌ గాంధీని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ఎందుకు ఆహ్వానించలేదని ఓ విలేకరి హిమంత బిశ్వశర్మను ప్రశ్నించగా ఆయన దీనిపై ఘాటుగా స్పందించారు.
ఇలాంటి పవిత్రమైన రోజున రావణుడి గురించి ఎందుకు మాట్లాడతారని ఆ విలేఖరిని ఎదురు ప్రశ్నించారు. ఈ ఒక్కరోజైనా రాముడి గురించి మాత్రమే మాట్లాడాలని.. దాదాపు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో మళ్లీ రాముడు కొలువయ్యాడని.. కనీసం ఇవాళైనా రావణుడి కోసం మనం మాట్లాడుకోవద్దని హిమంత బిశ్వశర్మ కామెంట్ చేశారు. అంటే పరోక్షంగా రాహుల్ గాంధీని రావణుడని హిమంత బిశ్వశర్మ అన్నారు. ఈ అస్సాం సీఎం కామెంట్లపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: