రేవంత్‌ రెడ్డి ఆయువు పట్టుపై దెబ్బకు బీఆర్ఎస్‌ ప్లాన్‌?

Chakravarthi Kalyan
రేవంత్‌ రెడ్డి గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఆ స్థానంపై బీఆర్ఎస్‌ దృష్టి సారించింది. మల్కాజ్ గిరి లో పోయిన సారి రేవంత్ రెడ్డి తక్కువ ఓట్లతో గెలిచాడని బీఆర్ఎస్‌ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. రేవంత్ నియోజకవర్గాన్ని ఎపుడూ పట్టించుకున్న పాపాన పోలేదని.. ఒక్క పైసా నిధులు తేలేదని.. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఈ సారి మనం గెలిచి సత్తా చాటాలని బీఆర్ఎస్‌ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇది పరీక్షా సమయమని.. మనం పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని.. అంటున్నారు.
కర్ణాటక లో ఐదు గ్యారంటీల హామీ ఇచ్చి కాంగ్రెస్ అభాసు పాలైందని.. అక్కడ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయి, ఇక్కడ కూడా కాంగ్రెస్ కు కర్ణాటక లాంటి పరిస్థితే ఉంటుందని బీఆర్ఎస్‌ నేతలు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: