దావోస్‌లో రేవంత్‌.. కేటీఆర్‌ తట్టుకోలేకపోతున్నారా?

Chakravarthi Kalyan

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్లివచ్చారు. అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దావోస్ లో 40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. అందుకే కేటీఆర్  జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి లండన్ లో మాట్లాడిన మాటల్లో తప్పేముందని ప్రశ్నించిన  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. కాళోజి నారాయణ రావు మాటలను.. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే అనే మాటలను బి. ఆర్. ఎస్ నేతలకు వర్తిస్తుంది ..అందుకే సీఎం మాట్లాడాడని గుర్తు చేశారు.
కెసిఆర్ పదేళ్లు రాష్టాన్ని కమీషన్ లకు కక్కుర్తి పడి అప్పులకుప్పగా మార్చారన్న  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి... కాళేశ్వరం.. మీ ధన దాహానికి ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. కాళేశ్వరం కుంగుబాటుకు కెసిఆర్ నైతిక భాద్యత వహించాలని.. కొత్త ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు కాలేదు. అప్పుడే ఓర్చుకోలేక పోతున్నారని  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: