రేవంత్‌ పైకి బీఆర్‌ఎస్‌ తిరుగులేని అస్త్రం?

Chakravarthi Kalyan
కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సమాచార హక్కు చట్టాన్ని సమర్థంగా వాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మనం పాలన మీదే దృష్టి పెట్టి యూట్యూబ్ ఛానళ్ల లో వచ్చిన అడ్డగోలు దుష్ప్రచారాన్ని సమర్ధంగా తిప్పికొట్ట లేకపోయామని బీఆర్ఎస్ అగ్రనేతలు ఇప్పుడు చెబుతున్నారు. ప్రగతి భవన్ లో విలాస వంతమైన సౌకర్యాలూ అంటూ దుష్ప్రచారం చేశారని.. కానీ ఇప్పుడు భట్టి అందులోనే ఉంటున్నారు, విలాసాలు ఉంటే భట్టి ఇప్పటికే టాంటాం చేయక పోయేవారా అంటూ ఆ నేతలు చెబుతున్నారు. పార్టీ కమిటీలు పూర్తిగా వేయక పోవడం వల్ల నష్టం జరిగింది...ఇక ముందు ఆలా జరగదంటున్న నేతలు.. మూడు నెలలకోమారు అన్ని కమిటీల సమావేశం నిర్వహించుకుందామని నిర్ణయించారు.


కార్ కేవలం సర్వీసింగ్ కు వెళ్ళింది... మళ్లీ రెట్టింపు వేగంతో పరుగెత్తుతుందని బీఆర్ఎస్‌ నేతలు ఆశాభావంతో ఉన్నారు. మోదీకి, రేవంత్ రెడ్డి కి భయ పడే పార్టీ భారాస కాదని.. ఎట్టి పని కైనా... మట్టి పని కైనా... తెలంగాణ ఏకైక గొంతుక భారాస అని గుర్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: