కేటీఆర్ ప్రజలను రెచ్చగొడుతున్నారా?

Chakravarthi Kalyan
200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని రేవంత్ రెడ్డి, నవంబర్ నుంచే కట్టొద్దని కోమటి రెడ్డి వెంకట రెడ్డి గతంలో పిలుపు నిచ్చారు. ఇప్పుడు వారి మాటలనే గుర్తు చేస్తూ కేటీఆర్ రాజకీయం ప్రారంభించారు. తాను బిల్లులు కట్టొద్దంటే భట్టి నాది విధ్వంసకర మనస్తత్వం అని అంటున్నారన్న కేటీఆర్‌... నిజాలు మాట్లాడితే విద్వంసకర మనస్తత్వమా అని ప్రశ్నించారు. సోనియా నే బిల్లులు కడుతుందని వాళ్ళు చెప్పారని.. కరెంటు బిల్లులు సోనియా కే పంపుదామని కేటీఆర్ అంటున్నారు.
సోనియా కు ప్రజలు కరెంట్ బిల్లులు పంపేలా భారాస ఎమ్మెల్యేలు నేతలు ప్రజలను సమాయాత్తం చేయాలన్న కేటీఆర్.. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ తప్పించుకున్నట్లే... పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదాపై మాట మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ హామీల నుంచి తప్పించుకుంటున్న తీరును ప్రజా కోర్టులోనే సాధికారికంగా ఎండగట్టాలని కేటీఆర్ పిలుపు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: