హైదరాబాద్‌లో పెరుగుతున్న కరోనా భయాలు..?

Chakravarthi Kalyan
మళ్లీ కరోనా విజృంభించబోతోందా.. మళ్లీ పాత కరోనా రోజులు రాబోతున్నాయా అన్న భయాందోళనలు కనిపిస్తున్నాయి. అయితే.. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌ డాక్టర్ శంకర్ అంటున్నారు. అయితే.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలు పాటించాలని ఆయన సూచించారు.
ముఖ్యంగా బీపీ, కిడ్నీ, చిన్న పిల్లలు, గర్బిణీలు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవాళ్లకు జేఎన్‌ 1 సోకే అవకాశం ఉందని... కోవిడ్ వైరస్‌ రూపాంతరం చెంది జేఎన్‌ 1 గా మారిందని...ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని డాక్టర్ శంకర్‌ పేర్కొన్నారు. మొన్న  ఫీవర్ ఆసుపత్రికి ఓపీకి వచ్చిన వారిలో నలుగురికి పాజిటివ్ వచ్చిందని.. జేఎన్‌ 1 అవునా కాదా అనే దాని కోసం ఆ నివేదికలను గాంధీ ఆసుపత్రికి పంపించామని డాక్టర్ శంకర్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: