హైదరాబాద్ నేతలకు థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్?
బాధ్యతాయుతమైన ప్రతిపక్షపాత్ర నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్న కేటీఆర్.. ఇందులో భాగంగా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకువస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిందని.. అయితే హామీలు నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ నగర అభివృద్ధి కోసం ఎప్పటిలానే నిరంతరంగా కృషి చేస్తుందని కేటీఆర్ అన్నారు.