రేవంత్‌ చేతికి.. శంషాబాద్‌లో 181 ఎకరాలు?

Chakravarthi Kalyan
రేవంత్ రెడ్డి సీఎం అయిన విశేషమో ఏమో కానీ.. శంషాబాద్‌లో అత్యంత విలువైన 181 ఎకరాల భూమిని ప్రభుత్వం కోర్టు కేసులో గెలుచుకుంది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏకు 181 ఎకరాల భూమి వివాదం కొలిక్కి వచ్చింది. ఇందులో దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ మేరకు సంబంధం లేని సర్వే నెంబర్లను చూపించి భూమిని స్వాధీనం చేసుకునేందుకు వారు ప్రయత్నించారు. వివాదం కోర్టుకు వెళ్లింది హెచ్ఎండిఏ కమిషనర్, న్యాయ విభాగం అధికారులతో భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి హైకోర్టులో ఆధారాలు సమర్పించారు.

ఈ కేసులో ఏడాది పాటు వాద ప్రతివాదనలు జరిగాయి. ధర్మాసనం గత నెల 18న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా నిన్న తుది తీర్పు హెచ్‌ఎండీఏకు అనుకూలంగా ఇచ్చింది. శంషాబాద్ లోని  ఈ 181 ఎకరాల భూములను హెచ్ఎండిఏ 1990 సంవత్సరంలో ట్రక్ టెర్మినల్ పార్క్ ఏర్పాటు కోసం సేకరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: