ఇవాళ ఆస్పత్రి నుంచి కేసీఆర్‌ డిశ్చార్జ్‌?

Chakravarthi Kalyan
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ఇవాళ హైదరాబాద్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలోదాదాపు వారం రోజుల క్రితం కాలు జారి పడడంతో ఆయన్ను ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అప్పట్నుంచి ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ కోలుకోవడంతో ఇవాళ మధ్యాహ్నం డిశ్చార్జ్ అవుతారు. వైద్యులు కేసీఆర్‌కు ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని ఇప్పటికే తెలిపారు.

డిశ్చార్జ్ అయిన తర్వాత కేసీఆర్‌.. హైదరాబాద్ బంజారా హిల్స్ నందినగర్ లోని నివాసంలో  ఉంటారు. ఆ ఇంటిని కొన్నేళ్లుగా కార్యాలయ అవసరాల కోసమే వినియోగిస్తున్నారు. ఇపుడు మళ్లీ నివాసానికి అవసరమైన మార్పులు, చేర్పులు చేశారు. కేసీఆర్ సహా కుటుంబ సభ్యులు సౌకర్యంగా ఇకపై నందినగర్ ఇంటిలోనే ఉండే అవకాశం ఉంది. ఫామ్ హౌస్‌ నగరానికి దూరంగా ఉండటం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తే వెంటనే వెళ్లడం ఇబ్బందిగా ఉన్నందున నందినగర్‌లోనే ఉండనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: