రేకుల షెడ్డులోనైనా ఉంటా.. రేవంత్‌ సంచలనం?

Chakravarthi Kalyan
ఆడంబరాల కోసం ప్రజల సొమ్ము ఖర్చు చేయబోనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దుబారా తగ్గిస్తామని ఆయన్ అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం.. ఎంసీహెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని క్యాంప్ ఆఫీసు కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే రేకుల షెడ్డు వేసుకునైనా ఉంటానని అన్నారు. ప్రజాభవన్ లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని కూడా వినియోగించుకుంటానన్నారు.


కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని.. శాసనసభ భవనాలను సమర్థంగా వాడుకుంటామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారాస ప్రభుత్వం 12, 14 గంటలకు మించి విద్యుత్ ఇవ్వలేదని.. హైదరాబాద్ లో మాత్రమే 24గంటలు ఉంటున్నదన్నారు. శ్వేతపత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభ సమావేశాల అజెండాను బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తాని రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారుల బదిలీలు, నియామకాల్లో ఎలాంటి పైరవీలు లేవని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: