ఏపీ రాజధానిగా అమరావతే.. మళ్లీ తేల్చి చెప్పిన కేంద్రం?

Chakravarthi Kalyan
ఏపీ రాజధానిగా అమరావతేనని మరోసారి కేంద్రం తేల్చి చెప్పింది. కేంద్ర పట్టణాభివృద్ది, గృహ మంత్రిత్వ శాఖ ఈ మేరకు పార్లమెంటులో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పింది. రాష్ట్రాల రాజధానులకు మాస్టర్‌ ప్లాన్‌ వ్యవహారంపై అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఎపి రాజధాని అమరావతిగా కేంద్రం పేర్కొంది. 28 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్‌ ప్లాన్‌ ఉందని, రాజధానుల పేర్లతో వెల్లడించిన కేంద్రం... అమరావతికి మాస్టర్ ప్లాన్ ఉందని, దాన్ని ఆమోదించినట్లు రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో తెలిపింది.

మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదం పొందిన వాటిలో అమరావతి కూడా ఉన్నట్లు సమాధానంలో పొందుపరిచిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ.. దేశంలోని 39శాతం రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్నది నిజమా..? కాదా? అన్న ప్రశ్నకు బదులిచ్చింది. ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తమన్న కేంద్ర మంత్రి.. ఏపీ రాజధాని అమరావతి సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని తెలిపారు. త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్ రాజధాని కోహిమా... మినహా మిగతా రాజధానుల మాస్టర్ ప్లాన్ లను ఆమోదించినట్లు కేంద్రం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: