ఇవాళ తెలంగాణ ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు. ఈరోజు కామారెడ్డి, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. కామారెడ్డి పట్టణం, దోమకొండలో రోడ్ షో లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఉదయం 10గంటలకు కామారెడ్డి పట్టణంలో రోడ్ షో ఉంటుంది. ఉదయం 11 గంటలకు దోమకొండలో రోడ్ షో ఉంటుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మల్కాజ్ గిరిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి రోడ్ షో లో పాల్గొంటారు.
చివరి రోజు రాహుల్ గాంధీ ప్రచార షెడ్యూల్ ఇలా ఉంది. రాహుల్ గాంధీ ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు జూబ్లీహిల్స్ ఆటో వర్కర్స్ యూనియన్, జిహెచ్ఎంసీ, గిగ్ వర్కర్స్ యూనియన్లతో ఇంటరాక్షన్ అవుతారు. 11:30 నుంచి 12:30 నాంపల్లిలో రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఇక ప్రియాంక గాంధీ ఉదయం 11:30 నుంచి 12:30 జహిరాబాద్‌లో ప్రచారం చేయనున్నారు.