మాజీ డిప్యూటీ మేయర్ హత్యకు రేవంత్ కుట్ర పన్నారా?

Chakravarthi Kalyan
జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌ ను హత్య చేసేందుకు రేవంత్ రెడ్డి సోదరుడు ఇతరులు ప్రయత్నించారని భారాస లీగల్‌ సెల్ కన్వీనర్ సోమా భరత్‌ ఆరోపించారు. కొడంగల్‌లో స్థానిక పోలీసులు పక్షపాతంగా వ్యవహారిస్తున్నారని.. బాబా ఫసియుద్దీన్‌తో కలిసి సోమా భరత్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని సోమా భరత్ తెలిపారు.ఈసీ సరిగ్గా స్పందించకపోతే న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు.

కొడంగల్‌లో హింసకు పాల్పడేలా రెచ్చగోడుతూ భీభత్సం సృష్టించారని సోమా భరత్‌ తెలిపారు. ప్రకటనలు సహా చాలా అంశాలపై ఫిర్యాదు చేసినా స్పందనలేదని.. ఈసీ, సీఈవో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్‌కు నోటీసుల విషయంలో ఫిర్యాదు ప్రతితో పాటు అన్ని వచ్చిన తర్వాత పూర్తిస్థాయి వివరణ ఇస్తామని భారాస లీగల్‌ సెల్ కన్వీనర్ సోమా భరత్‌ స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: