పార్టీ మారగానే వివేక్‌పై ఈడీని ప్రయోగించేశారా?

Chakravarthi Kalyan
మాజీ ఎంపీ వివేక్‌ ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన సంగతి తెలిసిందే. అప్పుడే ఆయన్ను ఈడీ టార్గెట్ చేసేసింది. ఇటీవల ఆయన నివాసంలోను, ఆఫీసుల్లోనూ ఈడీ సోదాలు జరిగాయి. హెచ్‌సిఏపై అనిశా లో నమోదైన మూడు కేసుల ఆధారంగా సోదాలపై ఈడి ప్రకటన విడుదల చేసింది. నిన్న తెలంగాణలో 9చోట్ల సోదాలు చేసిన ఈడి.. మాజి ఎంపి గడ్డం వినోద్‌, శివలాల్ యాదవ్‌, అర్షద్ ఆయూబ్‌ ఇళ్లలో సోదాలు చేసింది. ఎస్‌ఎస్ కన్సల్టెంట్స్ కార్యలయాలు, ఎండి సత్యనారాయణ ఇళ్ళు లో సోదాలు చేసిన ఈడి.. డిజిటల్ పరికరాలు, డాక్యుమెట్లు 10.39లక్షల నగదు స్వాధీనం చేసుకుంది.
మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ నియంత్రణలో ఉండి పలు కంపనీలకు కేంద్రంగా ఉన్న ఓ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించామని.. హెచ్‌సీఏలో 20కోట్ల నిధుల అక్రమాలపై అనిశా నమోదు చేసిన మూడు కేసులు, చార్జి షీట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని ఈడి ప్రకటించింది.  ఉప్పల్‌ స్టేడయంలో పనుల విషయంలో జాప్యం, ప్రయివేటు వ్యక్తులతో కలిసి నిధులు గోల్ మాల్ చేశారని ఏసీబీ కేసులు నమోదు చేసిందని ఈడి తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: