రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంపై నిషేధం విధిస్తారా?

Chakravarthi Kalyan
కార్యకర్తలను రెచ్చగొడుతూ బూతులు, దుర్భాషలు మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించాలని బీఆర్‌ఎస్‌ ఈసీకి ఫిర్యాదు చేసింది. బీఆర్‌ఎస్‌ ప్రతినిధులు ఈ మేరకు సీఈఓను కలిసి వినతి పత్రం అందించారు. పచ్చగా ఉన్న తెలంగాణను హింసాత్మకం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించిందని బీఆర్‌ఎస్‌ లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ అంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ పదేపదే కార్యకర్తలను రెచ్చగొడుతూ దాడులను ప్రోత్సహిస్తున్నారని బీఆర్‌ఎస్‌ లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ ఆరోపించారు.


పీసీసీ చీఫ్ రౌడీ మూకలను ప్రోత్సహిస్తున్నారని బీఆర్‌ఎస్‌ లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ అంటున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ చుట్టరికం ప్రతిరూపం రేవంత్ రెడ్డి అని బీఆర్‌ఎస్‌ లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు నిషేధించిన ప్రకటనలను బ్యాన్ డ్ అని పెట్టి మరీ ప్రసారం చేస్తున్నారని భరత్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: