దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌!

Chakravarthi Kalyan
దీపావళి పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా వర్ణించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దీపావళికి హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్య ఉందని.. జీవానికి సంకేతమైన అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారం తొలగించి చైతన్యం రగిలించి నూతనోత్తేజంతో ముందడుగు వేసేలా ప్రేరణనిస్తాయని అన్నారు.


మనలో అంతర్జ్యోతి వెలిగినప్పుడే జీవితం పట్ల స్పష్టత ఏర్పడి ప్రతి రోజు పండుగలా ఆవిష్కృతమవుతుందన్న సీఎం కేసీఆర్ .. మనం పయినించే ప్రగతి పథంలో అడుగడుగనా అడ్డుపడే నరకాసురుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల సంక్షేమాన్ని కోరి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటాకులు కాలుస్తూ దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్  సూచించారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలని.. ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: