కేసీఆర్‌ అఫిడవిట్లో తప్పు.. బయటపెట్టిన ఆర్‌ఎస్పీ?

Chakravarthi Kalyan
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలనే కాకుండా ఎలక్షన్ కమిషన్ ను కూడా మోసం చేశాడని.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అంటున్నారు. 2018 ఎన్నికల్లో గజ్వేల్ నుండి పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, తన అఫిడవిట్ లో స్థిరాస్తుల వివరాలు వెల్లడించలేదని
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సామాన్యులు నామినేషన్ పత్రాలలో ఏదైనా చిన్న తప్పు ఉంటే.. రిజెక్ట్ చేసే అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థిరాస్తుల వివరాలు తెలుపకున్న ఎలా ఆమోదించారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.

2018లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: