చంద్రబాబు-రామోజీ.. ఇద్దరూ సేమ్‌టు సేమ్?
తన ఎదుగుదలకు కారణమైన జీజేరెడ్డి కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవాల్సిన రామోజీరావు.. జీజేరెడ్డి కుటుంబ సభ్యులను బెదిరించి బలవంతంగా షేర్లు లాక్కున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం అయిన రెండు నెలలకే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని.. కోర్టుల తీర్పులు ఎలా ఉన్నా వీళ్ల నిజస్వరూపం ప్రజలకు అర్థమవుతోందని సజ్జల అన్నారు. రామోజీ, చంద్రబాబు వీరిద్దరిదీ ఒకటే బుద్ధి అని.. పెంచినవాళ్ళను, బతుకునిచ్చిన వాళ్ళను కాటేయడమే వీరి పని అని.. ఇద్దరి నేరాల్లో సారూప్యత, సామీప్యత కూడా స్పష్టంగా కనిపిస్తోందని సజ్జల అన్నారు. అందుకే వీరిద్దరూ ఒకటి అయ్యారన్న సజ్జల.. వైట్ కాలర్ నేరాల్లో వీరిద్దరూ కవలల జంట అని మండిపడ్డారు.