సిఐడి సిఐడి కార్యాలయంలో విచారణ జరుపుతున్న, రాజమండ్రి కేంద్రకారాగరం లోపలికి చంద్రబాబును తీసుకు వెళుతున్న వీడియోలు ఫోటోలు బయటకు రావడంపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సిఐడి కార్యాలయంలో గత నెల 9న చంద్రబాబును విచారిస్తున్న వీడియోలు ఫోటోలు సాక్షి ఛానల్ పేపర్ కు ఎలా విడుదల చేస్తారని ఆ పార్టీ ఎంపీ ravindra KUMAR' target='_blank' title='కనకమేడల రవీంద్ర కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కనకమేడల రవీంద్ర కుమార్ డీజీపీని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన డిజిపికి లేఖ రాశారు. విచారణ సమయంలో ప్రైవేటు వ్యక్తులను ఎలా అనుమతి ఇస్తారని ravindra KUMAR' target='_blank' title='కనకమేడల రవీంద్ర కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కనకమేడల రవీంద్ర కుమార్ నిలదీశారు. జ్యూడిషియల్ కస్టడీకి తరలించిన తరువాత కారాగారం లోపల వీడియోలు ఫోటోలు మీడియాకు విడుదల చేయడంపై కనకమేడల రవీంద్ర కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ రెండు ఘటనలపై వెంటనే విచారణ చేపట్టాలని బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. సిఐడి కార్యాలయంలో విచారణ గదిలోకి వచ్చిన ప్రైవేట్ వ్యక్తులు ఎవరు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో బయటపెట్టాలని ravindra KUMAR' target='_blank' title='కనకమేడల రవీంద్ర కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు.