తెలంగాణలో డబ్బే డబ్బు.. బంగారమే బంగారం.. ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చిన తర్వాత పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పోలీసులు తనిఖీల్లో కోట్ల రూపాలయలు నగదు, బంగారం పట్టుబడుతోంది. కేవలం హైదరబాద్ కమిషనరేట్ పరిధిలోనే కేవలం తొలి రెండురోజుల్లోనే 4.2 కోట్లు విలువ చేసే 7.706 కిలోల బంగారం, 8.77 లక్షలు విలువ చేసే 11.700కిలోల వెండి, 5.1 కోట్ల నగదు దొరికింది. వీటితో పాటు 110 లీటర్ల మద్యం, 23 మొబైల్ ఫోన్స్, 43క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని కూడా హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు కమిషనరేట్ లోని ఉన్నతాధికారులు, సిబ్బందితో కమిషనర్లు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు లేదా ఇతర ప్రలోభాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ప్రచార సమయంలో వివిధ రాజకీయ పార్టీల రూట్ ప్లానింగ్ , టైమింగ్ మరియు పర్మిషన్ల జారీ చెయ్యటం ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎస్‌హెచ్‌వో లు తమ ఠాణా పరిధిలోని లైసెన్స్ తుపాకులు అప్పగించేలా చూస్తున్నారు.