తెలంగాణ ఎన్నికల కోసం సాఫ్ట్‌వేర్‌ రెడీ?

Chakravarthi Kalyan
తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల కోసం ఈసీతో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అధికారులు పలు ఐటీ సాఫ్ట్ వేర్లను ఉపయోగిస్తారు. సీఈఓలు, ఈసీలోని ప్లానింగ్ డివిజన్ ప్లానింగ్ పోర్టల్ ద్వారా ఎన్నికల ప్లానర్, రానున్న ఎన్నికలు, హాలిడే మేనేజ్మెంట్, ఖాళీల నిర్వహణ తదితరాలను పర్యవేక్షిస్తారు. ఓటర్ల జాబితా, ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదుల కోసం నేషనల్ గ్రీవియెన్సెస్ సర్వీసెస్ ను వినియోగిస్తారు.


అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన అనుమతులు, అఫిడవిట్లు, పోలింగ్ శాతం నమోదు, అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, స్క్రూటినీ నివేదిక తదితరాల కోసం ఎన్ కోర్ వెబ్ సైట్ ను ఉపయోగిస్తారు. సీవిజిల్ యాప్ ద్వారా ప్రజల వచ్చే ఫిర్యాదులను పరిశీలించేందుకు సీవీజిల్ వెబ్ సైట్ వినియోగిస్తారు. సర్వీసు ఓటర్ల దరఖాస్తుల పరిశీలన, వివరాల నమోదు, తదితరాల కోసం సర్వీస్ ఓటర్స్ పోర్టల్ ఉపయోగిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: