బాబు కష్టం.. గుండెలు బాదుకున్న ఏబీఎన్ ఆర్కే?
ముద్దాయిలకు ఆహారం సరఫరా చేసే బాధ్యతను ఇటు సీఐడీ అధికారులుగానీ అటు న్యాయస్థానంగానీ తీసుకోలేదని రాధాకృష్ణ అన్నారు. ఇతరత్రా ప్రకృతి అవసరాలకు వారు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. 73 సంవత్సరాల వయసులో చంద్రబాబును ఈ విధంగా బాధించడం న్యాయమా అని నిలదీశారు. ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉండి ఉండకపోతే న్యాయ వ్యవస్థ ఇప్పటికైనా చొరవ తీసుకోవడం అవసరమంటున్నారు రాధాకృష్ణ.