ఇవాళే ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ?
గత నెల 24 వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ లో మొదటి విడత లో 11,700 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ నెల 2 వ తేదీన 8 ప్రాంతాలలో ఇళ్లను అందించారు. నేటి ఆన్ లైన్ డ్రా లో ఎంపికైన లబ్ధిదారులకు 21 వ తేదీన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇళ్ల ను అందిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం డబుల్ బెడ్ రూమ్ ల కోసం 7 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 95 వేలు మాత్రమే అర్హులుగా నిర్ధారించారు.