అమెరికాలోనూ కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం?

Chakravarthi Kalyan
కుల వివక్ష వ్యతిరేక బిల్లుకు తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా అసెంబ్లీ ఆమోదం తెలపడం కలకలం రేపింది. ఆ రాష్ట్రంలోని అట్టడుగు వర్గాలను వివక్షత నుంచి రక్షించేందుకు వీలుగా ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లును కాలిఫోర్నియా అసెంబ్లీ 50 - 3 ఓట్ల తేడాతో పాస్‌ చేసింది. ఆ తర్వాత గవర్నర్‌ గవీన్‌ న్యూసమ్‌ సంతకంతో ఇది చట్ట రూపం దాల్చబోతోంది. ఈ బిల్లును తొలిసారి అయిష వాహబ్‌ ప్రవేశపెట్టారు. దీనికి అమెరికా వ్యాప్తంగా కుల, జాతులకు చెందిన పలు ఉద్యమ సంఘాలు మద్దతు ఇచ్చాయి.

బిల్లుకు మద్దతుగా ఓటు వేసిన అసెంబ్లీ సభ్యులకు వాహబ్‌ సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్  చెప్పారు. అయితే దీన్ని హిందూ అనుకూల సంస్థలు తప్పుబడుతున్నాయి. కాలిఫోర్నియా చరిత్రలో ఇదొక చీకటి రోజని హిందూస్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా అభిప్రాయపడింది.  బిల్లుతో కాలిఫోర్నియా పౌరహక్కుల చట్టాలు, ఎడ్యూకేషన్‌, హౌసింగ్‌ కోడ్‌ వంటి వాటిల్లో మార్పులు రాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

usa

సంబంధిత వార్తలు: