గుడ్‌న్యూస్‌: డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇచ్చేది అప్పుడే?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో సెప్టెంబర్  2 వ తేదీన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్‌ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కోసం ఆన్ లైన్ డ్రా ద్వారా ఎంపిక చేసిన 12 వేల మంది లబ్దిదారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వర్చువల్ గా మాట్లాడారు. మంత్రితో మాట్లాడిన బహదూర్ పురా, ఆసిఫ్ నగర్, సైదాబాద్, యూసుఫ్ గూడ, బేగంబజార్, బొరబండ, చాంద్రాయణ గుట్ట తదితర ప్రాంతాలకు చెందిన పలువురు లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు.


పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చాలి, ఆత్మగౌరవంతో గొప్పగా బ్రతకాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, త్రాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.  పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను దరఖాస్తు చేసుకున్న వారికి దశల వారిగా అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని ఎన్ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండో మైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: