బీసీ విద్యార్థులకు కేసీఆర్ గుడ్‌న్యూస్?
బీసీ ఓవర్సీస్ విద్యా నిధి పథకం క్రింద విదేశాలలో పీజీ విధ్యను అభ్యసించాలనుకునే బీసీ, ఇబీసీ విద్యార్దులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విద్యా సంవత్సరానికి సెప్టెంబర్ – అక్టోబర్ సెషన్ కు సంబంధించి అభ్యర్దుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30 తేదీతో ముగుస్తుంది. అభ్యర్ధులు సెప్టెంబర్ 30 తేదీలోగా ధరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు, ఆన్ లైన్ అప్లికేషన్లకు https://www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ను చూడొచ్చు.