తెలంగాణ గవర్నర్‌పై ఎర్రన్నల ఆగ్రహం?

Chakravarthi Kalyan
ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తూ శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లుపై సంతకం పెట్టేందుకు గవర్నర్ ఉద్దేశ్యపూర్వకంగా ఆలస్యం చేస్తున్నట్లు అనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అంటున్నారు. పార్లమెంటులో ఆమోదించిన బిల్లులపై ఇప్పటికే రాష్ట్రపతి సంతకాలు చేయడంతో చట్ట రూపం తీసుకున్నదని, అంతకంటే ముందే శాసనసభలో ఆమోదం పొందిన బిల్లుల సమ్మతిపై ఆలస్యం వెనుక రాజకీయ ప్రేరిత కారణాలు ఉన్నట్లు స్పష్టమవుతోందని కూనంనేని సాంబశివరావు అంటున్నారు.


ఆర్టీసీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే ముందే మూడు రోజుల పాటు ఆపారని, ప్రభుత్వ వివరణ తరువాత సభలో ప్రవేశపెటేందుకు సమ్మతించారన్న కూనంనేని సాంబశివరావు.. ఉభయ సభల్లో ఆమోదించిన అదే బిల్లుపై పది రోజులు దాటినా ఆమోదముద్ర వేయడం లేదని విమర్శించారు. ఈ బిల్లుపై అంగీకారం తెలిపేందుకు జరుగుతున్న జాప్యం సుమారు 43వేల మందికి పైగా ఆర్టీస ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తున్నదని కూనంనేని సాంబశివరావు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: