ఏపీ ఎన్నికల పరిస్థితిపై టైమ్స్ నౌ నిర్వహించిన సర్వే ఫలితాలు టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చాయని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే అటు చంద్రబాబు, ఇటు లోకేశ్ శ్రమిస్తున్నారు. పాదయాత్రలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఇంత చేసినా టీడీపీ ఖాతా తెరవడం కూడా కష్టమేనంటోంది టైమ్స్ నౌ సర్వే. ఈ సర్వేలో ఏపీలోని మొత్తం 25 ఎంపీ సీట్లలో టీడీపీకి సున్నా నుంచి ఒక్క స్థానం రావచ్చని చెబుతోంది.
గత ఎన్నికల్లో టీడీపీకి మూడు ఎంపీ సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. టైమ్స్ నౌ సర్వే తాజా సర్వే ని బట్టి చూస్తే.. ఆ మూడింటింలో రెండు గెలుచుకోవడం కూడా కష్టమేనని చెబుతోంది. జగన్ గెలిస్తే గెలవొచ్చు కానీ.. మరీ ఇంత క్లీన్ స్వీప్ సాధ్యమా అని విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. టీడీపీ నేతలకు మాత్రం ఇది బిగ్ షాక్ అని చెప్పాలి.