బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

Chakravarthi Kalyan
రాజకీయాల్లో తిట్లు మరీ ముదిరిపోతున్నాయి. తాజాగా ఏపీ మంత్రి రోజా.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. ఏకంగా బోడి వెధవ అంటూ నోరుపారేసుకున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్‌ రుషికొండ వద్దకు వెళ్లి హంగామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో రోజా రెచ్చిపోయారు. సీఎం వైయస్‌ జగన్‌ విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ విషం చిమ్ముతున్నారని పర్యాటక శాఖ మంత్రి రోజా విమర్శించారు.

విశాఖను అంతర్జాతీయ సిటీగా తీర్చిదిద్దాలని జగన్ ప్రయత్నిస్తుంటే పవన్‌ మాత్రం విశాఖను క్రైమ్‌ సిటీగా, అక్కడి ప్రజలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ఏ సబ్జెక్ట్‌ గురించి మాట్లాడితే దాన్నే పవన్‌ రీమేక్‌ చేస్తూ పవర్‌ స్టార్‌ రీమేక్‌ స్టార్‌లా మారిపోయాడని రోజా ఎద్దేవా చేశారు. రుషికొండను బోడి కొండను చేశారని, బోడి వెదవలంతా బోడి ప్రచారం చేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: