తోడల్లుడి పుస్తకంలో చంద్రబాబు రహస్యాలు?

Chakravarthi Kalyan
చంద్రబాబు తొడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకంలో ఆయన గురించి అన్ని వివరాలు ఉన్నాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శాంతిభద్రతల సమస్య రావాలని.. సంక్షోభం నుంచి కూడా ఎన్ని ప్రాణాలు పోయినా తాను లాభపడాలనేదే చంద్రబాబు సిద్ధాంతమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబులో ఆ లక్షణం ముదిరి ఈ వార్ధక్యంలో పూర్తిగా తలలో కరుడు గట్టి పైశాచిక ఆనందం పొందుతున్నాడని సజ్జల రామకృష్ణారెడ్డి  ఘాటుగా విమర్శించారు.

పోలీసు విచారణలో కూడా కుట్ర కోణం కూడా స్పష్టంగా బయటపడుతోందన్న సజ్జల రామకృష్ణారెడ్డి .. రెండు రోజుల ముందే పోలీసుల మీద ఎటాక్‌ చేసి టౌన్‌లోకి తోసుకురావాలని ప్లాన్‌ చేసుకున్నారని తెలిపారు. పోలీసులు కాల్పులు జరిపి.. నలుగురైదుగురు కార్యకర్తలు మరణిస్తే సానుభూతి పొందాలని ప్రయత్నం చేశాడని సజ్జల రామకృష్ణారెడ్డి  తెలిపారు. ఒక వేళ తోసుకుని పోగలిగితే పుంగనూరును తగలబెట్టాలని చంద్రబాబు ప్లాన్‌ చేశారని సజ్జల అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: