లోకేశ్‌కు జోడీగా ఉదయభాను.. వైసీపీ సెటైర్లు?
దీనిపై వైసీపీ నేతలు సెటైర్లు విసురుతున్నారు. లోకేశ్ కార్యక్రమానికి స్పందన లేకపోవడంతో టీవీ యాంకర్‌తో కార్యక్రమం నిర్వహించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. యువగళానికి స్పందన కరువై, ఎవరూ గాలానికి చిక్కడం లేదని.. యాంకర్ గళాన్ని జోడించారు లోకేష్ అని సెటైర్ వేశారు. అయితే.. ఎన్ని పగటి కలలుకన్నా, డ్రామాలు వేసినా ప్రయోజనం లేదు బాబూ అంటూ విజయసాయి ఎద్దేవా చేశారు. లోకేశ్ తన చిన్ననాటి చందమామ కథలు ఆపేసి ప్రజలకు ఏం చేస్తారో చెబితే సంతోషిస్తాం కదా అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు.