బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?
అమరావతి ఎక్కడికెళ్లిందని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలు.. అది అక్కడే ఉందని.. అమరావతితో పాటు విశాఖపట్నం పెడుతున్నామని అంటున్నారు. అమ్మకు అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు అన్నట్లు చంద్రబాబు ఎన్నైనా చెప్తాడని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. చేయని వాటికి చంద్రబాబు ఎన్నైనా హామీలు ఇచ్చేస్తాడంటున్న వైసీపీ నేతలు నోటితో చెప్పే దానికి నోటు ఇచ్చేదానికి తేడా ఉందని గుర్తు చేస్తున్నారు.