ప్రభాస్‌కు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్?
ఆదిపురుష్ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు జగన్ సర్కారు అనుమతిచ్చింది. అన్ని థియేటర్స్‌లోనూ ప్రతి టికెట్‌కు రూ.50 పెంచుకునేలా జగన్ సర్కారు వెసులుబాటు కల్పించింది. అయితే పది రోజుల వరకు మాత్రమే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుందన్నమాట. తెలంగాణ సర్కార్ కూడా టికెట్ రేట్ల పెంపుకు పచ్చజెండా ఊపింది. తెలంగాణలో మొదటి మూడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌కు రూ.50 పెంచుకునేందుకు అనుమతి ఉంది. అలాగే తొలి రోజు ఆరు షోలు ప్రదర్శించుకోవచ్చు.