తెలంగాణలో పేదలకు కార్పొరేట్‌ వైద్యం?

Chakravarthi Kalyan
పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనేది సీఎం కేసిఆర్ ఆకాంక్ష అంటున్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అందుకే అధునాతన సదుపాయాలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. పేద ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే ధృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసిఆర్  అధునాతన టెక్నాలజీ, సకలసదుపాయాలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి పూనుకున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.  

వరంగల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణ ప్రాంగణాన్ని పరిశీలించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. నిర్మాణంలో ఇంకా వేగం పెంచాలని, అందుకు తగ్గట్టుగా మ్యాన్ పవర్ పెంచాలని అదేశించారు. జూన్ 22న తాను వరంగల్ హాస్పిటల్ సైట్ విజిట్ చేస్తానని ఆ సమావేశంలో సూచించిన అంశాలు ఆ రోజు పరిశీలిస్తానని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: