ఏంటి జగన్‌.. ఏపీ ర్యాంక్‌ అంతగా దిగజారిందా?

Chakravarthi Kalyan
జగన్ లీడర్‌ షిప్‌లో ఏపీ ర్యాంకు అనేక విషయాల్లో దిగజారుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. గతంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే మొదటి అయిదు స్థానాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు బాగా వెనుకబడిందట. ప్రస్తుతం ఏపీ 14వ స్థానానికి దిగజారడం జగన్‌ ప్రభుత్వ వైఫల్యం కాదా అని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఒక్క పెట్టుబడిదారుడు కూడా సిద్ధంగా లేరని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.

రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు వస్తే ఏంటి రాకపోతే ఏంటని జగన్ ఆలోచిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. భారతదేశంలోనే అత్యంత సంపన్న సీఎం జగన్‌ ఆలోచనల్లా ఆయన సంపద, ఆస్తుల మీదే. యువత భవిత, ఉద్యోగాలు ఆయనకు పట్టవని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ అమలు చేసే సంక్షేమమే ప్రజల సమస్యలకు పరిష్కారమన్నారు. గత నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని మహానాడులో చర్చిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: