మానవత్వం చాటుకున్న జగన్‌?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్.. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. నిరాదరణకు గురై నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితులకు సాయం చేసారు. తనను కలిసేందుకు ఎదురుచూస్తున్న అభాగ్యులను ప్రత్యేకంగా హెలిప్యాడ్ ప్రాంగణంలోకి పిలిపించుకున్నారు. వారి సమస్యలను సీఎం జగన్ సావధానంగా ఆలకించారు. చమర్చిన కళ్లతో సాయం కోరుతూ వచ్చిన బాధితులు వినతిపత్రాల ద్వారా సీఎం జగన్ కు తమ విజ్ఞప్తి చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆవేదనతో కోరారు. సీఎం జగన్.. వారి భుజం తట్టి ఓదారుస్తూ నేనున్నానని భరోసా ఇచ్చారు.

బాధితుల సమస్యలను ఆలకించిన సీఎం జగన్ తక్షణసాయంగా ఒక్కొక్కరికి రూ.ఒక లక్ష నగదు ఇవ్వాలని ఆదేశించారు.  అవసరమైన వైద్య సేవలు సత్వరమే ఆరుగురికి అందించాలని  జిల్లా కలెక్టర్ ను సీఎం జగన్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ప్రత్యేకంగా అభాగ్యుల వద్దకు వెళ్లి వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తానే స్వయంగా నమోదు చేసుకున్నారు.  ప్రభుత్వపరంగా అన్ని ప్రయోజనాలు కల్పించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: