హైదరాబాద్‌కు త్వరలో మరో స్పెషల్ అట్రాక్షన్‌?

Chakravarthi Kalyan
హైదరాబాద్ నగరంలో మరో పురాతన మెట్ల బావి పునరుద్ధరణ చేయనున్నారు. దీని కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాట్లు చేస్తోంది. 300 సంవత్సరాల క్రితం నాటి ఫలక్ నూమ బస్ డిపోలో స్టెప్ వెల్ ఉన్న అంశం హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి అధికారుల దృష్టికి తాజాగా వచ్చింది. ఏప్రిల్ 3వ తేదీన స్టెప్ వెల్ పునరుద్ధరణ చర్యల్లో భాగస్వామ్యంగా ఉన్న కల్పనా రమేష్ తో కలిసి హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఆర్టీసీ అధికారులు డిపో లోపల ఉన్న పురాతన మెట్ల బావిని సందర్శించారు.

ఫలక్ నుమా ప్యాలెస్ కు అతి సమీపంలో ఉన్న ఈ పురాతన మెట్ల బావి ని నిజాం తన వ్యక్తిగత ఈత కొలను గా వాడేవారని భావిస్తున్నారు. ఫలక్ నుమా బస్ డిపో స్టెప్ వెల్ పునరుద్ధరణ కోసం తెలంగాణ ఆర్టీసీ, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, సాహి ఎన్జీవో సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: