జీహెచ్‌ఎంసీ.. అధికారులు వర్సెస్‌ కార్పొరేటర్లు?

Chakravarthi Kalyan
జీహెచ్‌ఎంసీలో అధికారులు, కార్పొరేటర్ల మధ్య రగడ రాజుకుంది.  అధికారులతో కార్పొరేటర్లు  మర్యాదగా ప్రవర్తించాలని.. లేని పక్షంలో అధికారులుగా సహకరించమని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ మమత అంటున్నారు. బిజెపి కార్పొరేటర్లు అధికారుల పట్ల అనుచిత ధోరణికి నిరసనగా కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించామని ఆమె తెలిపారు.  జలమండలి కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఎటువంటి సంస్కారం పద్ధతి లేకుండా అధికారుల కార్యాలయం చాంబర్లో సిల్ట్ వేశారని.. అధికారులపై అనుచితంగా మాట్లాడారని ఆమె అన్నారు.
జిహెచ్ఎంసి అధికారులు ఖండిస్తున్నట్లు ప్రకటిస్తూ జలమండలి అధికారులు మద్దతుగా కౌన్సిల్ సమావేశం బహిష్కరిస్తున్నట్టు మమత తెలిపారు. కార్పొరేటర్ల సమస్యలను సర్కిల్ నుండి జోనల్ వరకు అధికారులు సమస్యలను విని సామరస్యంగా పరిష్కరించడం కోసం కృషి చేస్తున్నట్లు , జిహెచ్ఎంసి అధికారులతో పాటు జలమండలి అధికారులు కూడా కష్టపడి పనిచేస్తున్నామని మమత అన్నారు. అయినా అధికారులను ఇష్టమొచ్చిన విధంగా మాట్లాడటమే కాకుండా అధికారులదే తప్పు అని అధికారులపై అందరి ముందు అన్ పార్లమెంటరీ పదాలతో ఇష్టమైన రీతిలో తిట్టడం సరికాదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: