ఆటిజం సమస్యా.. ఇలా ఎదుర్కోండి?

Chakravarthi Kalyan
ఇటీవల అంతర్జాతీయ ఆటిజం మాసం ఉత్సవాలను నిర్వహించారు. ఆటిజం వ్యాధి లక్షణలు, వాటి పరిష్కారాల మార్గాలు వంటి అంశాలపై చర్చ జరిగింది.  ఆటిజం సమస్య చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆటిజం వ్యాధిని వెంటనే గుర్తించి వైద్యుల సంరక్షణలో చికిత్స అందిస్తే మంచి ఫలితాలు పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.  మెదడు పనితీరులో లోపం కారణంగా ప్రధానంగా ఈ ఆటిజం సమస్యను ఎదుర్కోవాల్సి  వస్తుంది.  మానసిక వైద్యుల వద్దకు ఆటిజం లక్షణాలతో వస్తున్న చిన్నారుల సంఖ్య పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
కరోనా తర్వాత ఇలాంటి సమస్యలు ఉన్న పిల్లలు ఎక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది. ఈ వ్యాధిపై వైద్యుల్లోనూ, తల్లీదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇటీవల  అంతర్జాతీయ ఆటిజం మాసం ఉత్సవాలు జరిగాయి. ఈ సదస్సులో ఆటిజం లక్షణలు, వాటి పరిష్కారాల మార్గాలు వంటి అంశాలను వైద్యులు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: