ఔటర్ రింగ్ రోడ్డు లీజులో అన్ని కోట్ల అవినీతా?

Chakravarthi Kalyan
ఔటర్ రింగ్ రోడ్డు లీజు కాంట్రాక్టుపై విమర్శలు వస్తున్నాయి. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన టెండర్‌ను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు డిమాండ్ చేశారు. లేకపోతే సెంట్రల్‌ విజిలెన్స్‌,సీబీఐ, ఐడీ కి ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టుకు కూడా వెళతానని రఘునందన్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర లో పెడుతున్న సభలకు, చేరికలకు ఔటర్‌ రింగ్ రోడ్డు లీజు కాంట్రాక్టు దక్కించుకున్న ఐఆర్బీ సంస్థ ఫండింగ్ చేస్తుందాలనే అనుమానాలు కలుగుతున్నాయని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు తెలిపారు.
ఔటర్‌ రింగ్ రోడ్డుపై హెచ్‌ఎండీఏకు వచ్చిన ఆదాయమెంటో మంత్రి కేటీఆర్, అరవింద్ కుమార్ లు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. టెండర్‌లను పబ్లిక్ డొమైన్‌లో పెట్టేందుకు అరవింద్‌కుమార్‌కు ఉన్న అభ్యంతరమేంటని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ప్రశ్నించారు. బిడ్ ఓపెన్ చేసిన తర్వాత ప్రభుత్వం పెద్దలు ఐదారు రోజులు బయటకు వెళ్లారా...వారు ఎవరితో చర్చలు జరిపారని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ORR

సంబంధిత వార్తలు: