తెలంగాణ రైస్‌ మిల్లర్లకు వార్నింగ్‌?

Chakravarthi Kalyan
తెలంగాణలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో డిఫాల్ట్‌ అయిన రైస్‌ మిల్లర్లు 15 రోజులులోగా బకాయి పడిన బియ్యాన్నిప్రభుత్వం హెచ్చరించింది. ఆయా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్‌ లేకుండా చూసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిల్లర్ల నుంచి సీఎంఆర్‌ తీసుకునే సమయంలో నాణ్యత విషయమై ఏ మాత్రం రాజీ పడొద్దని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

రైస్‌ మిల్లర్ల నుంచి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ సేకరణలో మరింత కఠినంగా వ్యవహరించాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అదే స్థాయిలో సీఎంఆర్‌ సేకరణలో కూడా ఇవ్వాలని రవీందర్‌ సింగ్‌ సూచించారు. సీఎంఆర్‌లో జాప్యం జరగడం వల్ల సంస్థపై వడ్డీ భారం పెరుగుతోందని.. సీఎంఆర్‌ అప్పగించడంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 90శాతం మిల్లర్లుకు లేని ఇబ్బంది 10శాతం మందికే ఎందుకు వచ్చిందని రవీందర్‌ సింగ్‌ నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

TS

సంబంధిత వార్తలు: